యాపిల్ టీతో ఆరోగ్యంగా...

19-06-2019: రోజుకొక్క యాపిల్‌ని తింటే ఎటువంటి రోగాలు దరిచేరవంటారు. యాపిల్‌ పండునే కాదు, యాపిల్ టీ కూడా అంతటి ప్రయోజనకారి అంటున్నారు న్యూట్రిషనిస్టులు. సాధారణంగా బరువు తగ్గటానికి గ్రీన్‌టీని ప్రిఫర్‌ చేస్తారు. కానీ యాపిల్‌ టీ కూడా ఫిట్‌నెస్‌తోపాటు శరీరబరువును అదుపులో ఉంచుతుందట. రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్‌ఫెక్షన్లను నివారించడంలో కీలకపాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. అంతేకాదు ఉదర సంబంధ సమస్యలన్నింటికీ యాపిల్‌ టీ చక్కటి ఔషధం. జాయింట్‌ పెయిన్‌ సమస్యలనుంచి ఉపశమనం కలిగిస్తుంది. యాపిల్‌ టీతో చర్మం కాంతిమంతంగా తయారై, నిగనిగలాడుతూ శారీరక సౌందర్యంలో కూడా ఉపయోగపడుతుందట.