గ్రీన్‌ కాఫీ కూడా వచ్చేసింది!

అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): గ్రీన్‌ టీ తరహాలోనే గ్రీన్‌ కాఫీ కూడా అందుబాటులోకి వచ్చింది. హెల్తియర్‌ కాఫీ పేరిట సఫోలా కంపెనీ గ్రీన్‌ కాఫీని అందిస్తోంది. ఇది గ్రీన్‌ టీ లాగే చిన్న చిన్న ప్యాకెట్లలో లభిస్తుందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. మామూలు కాఫీతో పోలిస్తే వీటిలో యాంటీ ఆక్సిడెంట్‌లు 3 రెట్లు అధికంగా ఉంటాయని తెలిపారు.