హృద్రోగులకు శుభవార్త

అందుబాటులోకి అలా్ట్ర ఫిల్టరేషన్‌ యంత్రం
శరీరంలో నీటిని తొలగించేందుకు దోహదం

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): హృద్రోగుల శరీర అవయవాల్లో చేరే నీరు ప్రమాదకరం. గుండె జబ్బులతోపాటు.. కిడ్నీ సమస్యతోనూ బాధపడేవారిలో ఇది మరింత ప్రమాదం. వారి శరీరం లో ఉండే నిల్వ నీటిని తొలగించేందుకు ‘స్లో కంటిన్యూస్‌ అలా్ట్ర ఫిల్టరేషన్‌ యంత్రం’ అందుబాటులోకి వచ్చింది. సీనియర్‌ కార్డియాలజిస్టు డాక్టర్‌ శరత్‌చంద్ర, నెఫ్రాలజిస్టు డాక్టర్‌ ఎస్‌కే నాయక్‌ సోమవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. యంత్రం ఖర్చు ను భరించే, అద్దెకు తీసుకునే స్తోమత ఉన్న రోగులు ఇళ్లలో కూడా ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చని తెలిపారు. దీన్ని తొలిసారిగా విరించి ఆస్పత్రిలో ఏర్పాటు చేశామన్నా రు. ప్రయోగాత్మకంగా ఓ రోగి శరీరంలోంచి ఈ యం త్రం ద్వారా 10 గంటల్లో 2వేల మి.లీ. నీటిని తొలగించామని తెలిపారు. గుండెకు చికిత్స అందించడంలో తలెత్తే ఇబ్బందులను దీని ద్వారా అధిగమించవచ్చని, సిటింగ్‌కు రూ.లక్ష దాకా ఖర్చవుతుందన్నారు.