డెంగీ రాకుండా చూసుకోండి ఇలా..

11-09-2019: ఫ్లవర్‌ వాజ్‌, ఎయిర్‌ కూలర్‌ నీళ్ళను నిత్యం మార్చాలి.

కాలనీ, ఇళ్లలో నిల్వ ఉండే నీటి గుంతలను పూడ్చాలి.
ప్లాస్టిక్‌ బకెట్లు, ట్యూబ్‌, టైర్లు ఇళ్లలో ఉంచవద్దు.
ఇంటిపై ఉండే ట్యాంకులకు మూతలు పెట్టాలి.
పండ్ల తొక్కలను ఇంటి పరిసర ప్రాంతాల్లో వేయవద్దు.
డబ్బాలు, కుండలు కుండీల్లో నీరు నిల్వకుండా జాగ్రత్త పడాలి.
ప్రతి వారం డ్రై డే పాటించాలి.

దోమ కాటు తప్పించుకోండిలా..

పగలు దోమ కుట్టదనే భావనంతో ఉండకూడదు.
పగటి పూట శరీరంగా పూర్తిగా కవర్‌ అయ్యే దుస్తులు ధరించాలి.
పడుకునే ముందు దోమ తెరను ఏర్పాటు చేసుకోవాలి.
మస్కిటో రిఫిలెంట్స్‌ తప్పని సరిగ్గా వినియోగించాలి.
తలుపులు, కిటికీలు మస్కిటో స్ర్కీన్‌తో కవర్‌ చేసుకోవాలి.