24 గంటల్లో డెంగీ రిపోర్టు

అధికారులకు వైద్య ఆరోగ్యశాఖ ఆదేశం

హైదరాబాద్‌, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): డెంగీ నిర్ధారణ పరీక్షల నివేదికలను రోగులకు ఇవ్వడంలో ఆలస్యం చేయొద్దని.. ఎట్టి పరిస్థితుల్లో 24గంటల్లో రోగికి రిపోర్టు ఇవ్వాలని వైద్య ఆరోగ్యశాఖను ప్రభుత్వం ఆదేశించింది. శుక్రవారం కోఠిలోని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కార్యాలయంలో ముఖ్యకార్యదర్శి శాంతికుమారి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గాంధీ, ఉస్మానియాలో ఫీవర్‌ కౌంటర్లను పెంచాలని ఆదేశించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో అనుమానిత రోగులందరికీ ఎలీసా పరీక్షలు నిర్వహించాలన్నారు.