ఫీడర్‌ అంబులెన్స్‌లో ప్రసవం

15-09-2019: రవాణా సౌకర్యాలు లేని ఏజెన్సీలో ప్రభు త్వం నడుపుతున్న ఫీడర్‌ అంబులెన్స్‌లో ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం ఉపరిల్ల గ్రామానికి చెందిన కట్ల చిన్నమ్మకు శనివారం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యు లు ఫీడర్‌ అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చా రు. అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకెళుతుండ గా నొప్పులు ఎక్కువయ్యాయి. అంబులెన్స్‌ను డ్రైవర్‌ రోడ్డు పక్కన నిలపగా.. పాపకు మహిళ జన్మనిచ్చింది.