ఫోన్‌, టీవీతో పిల్లలు దుందుడుకు

17-08-2019: టీవీలు, స్మార్ట్‌ఫోన్లతో పిల్లలు రోజుకు 2గంటలకు మించి సమయం గడిపినా.. కనీసం 9నుంచి 11 గంటలు నిద్రపోకపోయినా, వారిలో దుందుడుకు స్వభావం పెరుగుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో వారు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఈ రెండు విషయాలు దారితీస్తాయని ఒటావాలోని హెల్దీ యాక్టివ్‌ లివింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ గ్రూప్‌(హాలో)నకు చెందిన పరిశోధకులు వెల్లడించారు. ఈమేరకు 4524మంది చిన్నారుల్లో స్వభావాల మార్పునకు సంబంధించి వివరాలు సేకరించారు. పిల్లల్లో దుందుడుకు స్వభావం మానసిక సమస్యలకు, వ్యసనాలకు దారితీసే ప్రమాదం ఉందని, వారు స్మార్ట్‌ఫోన్‌ లేదా టీవీ చూసే సమయం 2గంటలకు మించకుండా చూసుకోవాలని హాలో బృందానికి చెందిన మిషెల్‌ గురెరో తెలిపారు.