గ్రీన్‌, బ్లాక్‌ టీతో మెదడుకు ఆరోగ్యం

13-09-2019: మీరు రోజూ గ్రీన్‌ టీ లేదా బ్లాక్‌ టీ తీసుకుంటున్నారా? అయితే, ఇతరుల కంటే మీ మెదడు మరింత ఆరోగ్యంగా పనిచేస్తుంది. వారానికి నాలుగు సార్లు తేనీరు సేవించే వృద్ధుల మెదడు ఇతరుల కంటే చురుగ్గా పనిచేసినట్లు నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌(ఎన్‌యూఎ్‌స) పరిశోధకులు తేల్చారు. 60 ఏళ్లకు పైబడిన 36 మందిపై 2015-18 మధ్య కాలంలో చేసిన పరిశోధనల ఫలితాల ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చారు. వీళ్లు 25 ఏళ్లుగా వారానికి కనీసం 4 రోజులు గ్రీన్‌ టీ, బ్లాక్‌ టీ లేదా ఊలాంగ్‌ టీ (చైనాలో సేవిస్తారు) తాగారు. దీంతో మెదడులో వృద్ధాప్య లక్షణాలు నెమ్మదించినట్లు తేలింది.