డయాబెటిస్‌కు ఆయుర్వేద చికిత్స

జాతీయ విధానం ఆవిష్కరించిన కేంద్రం 

‘మిషన్‌ మధుమేహ’కు శ్రీకారం: జితేంద్ర సింగ్‌

న్యూఢిల్లీ, అక్టోబరు 28: ఆయుర్వేదం ద్వారా డయాబెటిస్‌ చికిత్సకు జాతీయ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. జాతీయ ఆయుర్వేద దినోత్సవానికి సంబంధించిన లోగోను కూడా విడుదల చేసింది. శుక్రవారం జాతీయ ఆయుర్వేద దినోత్సవం. ఈ సందర్భంగా ఆయుష్‌ విభాగం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయుష్‌ మంత్రి శ్రీపాద యశో నాయక్‌ అధ్యక్షత వహించారు. పీఎంవో సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ విధానం ప్రకారం, ఆయుర్వేదం ద్వారా డయాబెటి్‌సకు చికిత్స చేయవచ్చని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ముగ్గురు ఆయుర్వేద వైద్యులకు జితేంద్ర సింగ్‌ ధన్వంతరి అవార్డులను అందజేశారు. దీని కింద ఒక్కొక్కరికి రూ.5 లక్షల నగదు బ హుమతులిచ్చారు. ఏటా ఒక వ్యాధిపై అవగాహన, నియంత్రణ, పరిశోధన జరపాలని నిర్ణయించామని, ఈ ఏడాది డయాబెటి్‌సను ఎంపిక చేశామన్నారు. మిషన్‌ మధుమేహకు శ్రీకారం చుడుతూ ఆయుర్వేద దినోత్సవాన్ని ప్రారంభిస్తున్నామని ఆయుష్‌ కార్యదర్శి అజిత్ చెప్పారు.
 
యాప్స్‌తో డయాబెటిస్‌ స్వీయ నియంత్రణ 
స్మార్ట్‌ఫోన్‌ యాప్స్‌ను ఫాలో అయ్యేవారిలో మధుమేహం నియంత్రణలో ఉంటోందట. డయాబెటిస్‌ స్వీయ నియంత్రణకు యాప్స్‌ సమర్థంగా ఉపయోగిస్తున్నాయని ఓ అధ్యయనంలో తేలింది. ఈ యాప్స్‌ ఉపయోగించని వారితో పోలిస్తే, ఉపయోగించే వారిలో హెచ్‌బీఏ1సీ 0.5 శాతం తగ్గిందని గతంలో చేసిన 14 అధ్యయనాలను విశ్లేషించి తేల్చారు. అందులోనూ యువత ఎక్కువగా వీటివల్ల లబ్ధి పొందుతోందని విశ్లేషించారు.