ఆయుర్వేదంతో నిరంతర ఆరోగ్యం

గుంటూరు: ఆయుర్వేదం మందులు వాడేవారు నిరంతరం ఆరోగ్యంగా ఉంటారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి అన్నారు. స్థానిక బ్రాడీపేటలోని స్నిగ్ధ ఆయుర్వేద వైద్యశాలలో శుక్రవారం ఆయుర్వేద పితామహుడు ధన్వంతరి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మోదుగుల మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ధన్వంతరి జయంతిని ఆయుర్వేదం దినంగా ప్రకటించడం ఆయుర్వేద వైద్యానికి ప్రతిష్టాత్మకమని అన్నారు. సభలో ఆరోగ్య రక్షణ- గృహ ఔషధాలు పుస్తకాన్ని ఎమ్మెల్యే మోదుగుల ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ కేఎస్‌ఆర్‌ గోపాలం దంపతులు, డాక్టర్‌ బి.చైతన్య దంపతులు, డాక్టర్‌ సాయిప్రసాద్‌, డాక్టర్‌ కోగంటి శ్రీరంగనాయకి తదితరులు పాల్గొన్నారు.