3డీ ముద్రిత చర్మం.. రక్తనాళాలతో సహా

న్యూయార్క్‌, నవంబరు 4: రక్త నాళాలతో కూడిన 3డీ ముద్రిత చర్మాన్ని భారత సంతతి శాస్త్రవేత్త పంకజ్‌ కరండే నేతృత్వంలోని రెన్‌సెలర్‌ పాలిటెక్నిక్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. రక్త నాళాలతో కూడిన 3డీ ముద్రిత చర్మాన్ని భారత సంతతి శాస్త్రవేత్త పంకజ్‌ కరండే నేతృత్వంలోని రెన్‌సెలర్‌ పాలిటెక్నిక్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చే సమీప భవిష్యత్తులో అగ్నిప్రమాదాల్లో శరీరం కాలిపోయిన వారికి మునుపటి దేహ సౌందర్యాన్ని ప్రసాదించేందుకు 3డీ ముద్రిత చర్మం దోహదం చేస్తుందని పంకజ్‌ వెల్లడించారు. డయాబెటిక్‌, ప్రెషర్‌ అల్సర్‌లతో బాధపడేవారికి చికిత్స అందించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో ఈవిషయం వెల్లడైందని తెలిపారు. రక్తనాళాల్లో ఉండే ఎండోథీలియల్‌ కణాలు, పెరిసైట్‌ కణాలు, జంతువుల చర్మంలోని కొలేజెన్‌లతో 3డీ ముద్రిత చర్మానికి రూపునిచ్చామని ఆయన పేర్కొన్నారు.