ప్రపంచంలోనే అతి చిన్న స్టెంట్‌

10-08-2019: ప్రపంచంలోనే అతి చిన్న స్టెంట్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాటికంటే 40వ వంతు చిన్నగా ఉండటం దీని విశిష్టత. కాకపోతే గుండె ధమనుల్లో రక్తం గడ్డకట్టిన రోగులకు ఉపయోగించరు. చిన్నపిల్లల్లో ఎదురయ్యే మూత్ర విసర్జన ఇబ్బందులను తొలగించడానికి ఈ స్టెంట్‌ను వినియోగిస్తారు. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌కు చెందిన ఫెడరల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు దీనిని అభివృద్ధి చేశారు. ఆ వివరాలను అడ్వాన్స్‌డ్‌ మెటీరియల్స్‌ టెక్నాలజీ అనే జర్నల్‌లో ప్రచురించారు.