వయసుకు, స్థూలకాయానికి సంబంధమేంటి?

13-09-2019: వయసు పైబడుతున్న కొద్దీ బరువు పెరగడం సహజం. అయితే, ఈ స్థూలకాయానికి, వయసుకు మధ్య సంబంధాన్ని స్వీడన్‌కు చెందిన పరిశోధకులు కనుగొన్నారు. వయసు పైబడిన కొద్దీ శరీరంలో కొవ్వును కరిగించుకునే శక్తి తగ్గుతుంది. దీంతో బరువు పెరిగి స్థూలకాయానికి దారి తీస్తుంది. మన శరీరానికి కొవ్వు అవసరమే. ఈ కొవ్వు కరుగుతూ శక్తిని ఇవ్వడంతో పాటు మన నరాలు, ఆరోగ్య కణాల చుట్టూ రక్షణ పొరగా ఏర్పడుతుంది. అయితే, మనం ఖర్చు చేసే శక్తి కంటే ఎక్కువ కేలరీలు తీసుకుంటే అధిక బరువుకు దారి తీస్తుంది. అధిక కొవ్వును కరిగించే ఆధునిక ఔషధాలు అందుబాటులోకి రావడంతో ఇటీవల ప్రజల జీవిత కాలం పెరిగింది.