కంటినిండా నిద్రతోనే ఆరోగ్యం!!

లండన్‌, జనవరి 16 : కంటినిండా నిద్రపోతే శారీరక ఆరోగ్యానికి ఢోకా ఉండదని బ్రిటన్‌లోని మాంఛెస్టర్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. జీవగడియారం ప్రకారం నిద్రిస్తే కండరాలు, ఎముకలు, చర్మంలలోని కణజాలాల్లో నిర్మాణాత్మక, రసాయనిక చర్యలు గతి తప్పవని తెలిపారు. శరీరంలోని కణజాలాల్లో కొలాజెన్‌ అనే ప్రొటీన్‌ ఉంటుంది.

 అందులోని అతిసూక్ష్మమైన(10- 100 నానోమీటర్లు) తాడు లాంటి నిర్మాణాలను ఫైబ్రిల్స్‌ అంటారు. రోజూ రాత్రి 8 గంటలకు నిద్రపోయి.. ఉదయం 5కల్లా మేల్కొనే వారి శరీర కణజాలాల్లో ఈ కీలకమైన ప్రొటీన్లు అత్యంత క్రియాశీలంగా ఉంటున్నట్లు అధ్యయనంలో గుర్తించారు.