రోజుకో యాపిల్‌ తింటే నిమోనియా దూరం

06-09-2019: రోజుకో యాపిల్‌ తింటే.. ఊపిరితిత్తుల వాపు (నిమోనియా) వ్యాధి మన దరిచేరదంటున్నారు స్వీడన్‌లోని ఉమియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. యాపిల్‌లో ఉండే విటమిన్‌ సీ.. వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే దీనికి కారణంగా తమ పరిశోధనల్లో తేలిందన్నారు. దీని కోసం చుంచెలుకలపై అధ్యయనం చేశారు. నిమోనియాకు కారణమయ్యే బ్యాక్టీరియా దాడి చేసినప్పుడు.. దాన్ని ఎదుర్కొనేందుకు హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ విడుదల చేసిందని పరిశోధకులు నెల్సన్‌ గెకర చెప్పారు. ఆ హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ విడుదలలో కీలకపాత్ర పోషించే విటమిన్‌ సీ యాపిల్‌లో పుష్కలంగా లభిస్తోందన్నారు.