పేగుల్లో చెడు బ్యాక్టీరియాతో సంతానోత్పత్తిపై ప్రభావం

హ్యూస్టన్‌, జనవరి 24: పేగుల్లో ఉండే అనారోగ్యకరమైన బ్యాక్టీరియా(గట్‌ బ్యాక్టీరియా) సంతానోత్పత్తిపై కూడా ప్రభావం చూపిస్తుందని అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడైంది. గట్‌ బ్యాక్టీరియా వల్ల యుక్త వయసు అమ్మాయిల్లో ఊబకాయం, పీసీఓఎస్‌ ప్రమాదం ఎక్కువని వారు హెచ్చరిస్తున్నారు. పీసీఓఎస్‌ అంటే మహిళల్లో టెస్టోస్టీరాన్‌ అధికంగా ఉత్పత్తి కావడం. దీనివల్ల అవాంఛిత రోమాలు పెరుగుతాయి. నెలసరి సరిగ్గా ఉండదు. దీంతో సంతానోత్పత్తిపై ప్రభావం పడుతుంది. వీటితో పాటు అనారోగ్య బ్యాక్టీరియా వల్ల మధుమేహం, గుండెజబ్బులు వచ్చే అవకాశం కూడా ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు.