రక్తపోటు వల్ల మతిమరుపు!

11-09-2019: అధిక రక్తపోటు ఉన్నవారికి మతిమరుపు కూడా వచ్చే ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు అమెరికాలోని కొలంబియా వర్సిటీ పరిశోధకులు. మధ్య, పెద్ద వయసు వారే ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. అధ్యయనంలో భాగంగా 11 వేల మందికి సంబంధించిన సమాచారాన్ని వారు విశ్లేషించారు. దాంతోపాటు కొందరిని జ్ఞాపకశక్తిని పరీక్షించే ప్రశ్నలు అడిగారు. దానిలో 55 ఏళ్లపైబడిన వయసు ఉండి రక్తపోటుతో బాధపడుతున్న వారు సరైన సమాధానాలు ఇవ్వలేకపోయారని తెలిపారు. అయితే, మతిమరుపునకు రక్తపోటు ఎలా కారణమవుతోందో పూర్తిగా తెలియదని, దాని కోసం పరిశోధనలు జరుపుతున్నామని శాస్త్రవేత్త సుమిన్‌రుయ్‌ తెలిపారు.