పిల్లల్లో అతిసార తగ్గించే పరికరం!

11-08-2019: ఐదేళ్లలోపు పిల్లలకు ఎక్కువగా వచ్చే అతిసారాన్ని(డయేరియా) తగ్గించేందుకు స్టాన్‌ఫోర్డ్‌ వర్సిటీ పరిశోధకులు ఆక్వాటాబ్స్‌ అనే పరికరాన్ని రూపొందించారు. ఇది నీటి ద్వారా అతిసారం వ్యాప్తిని నిరోధిస్తుందని పరిశోధకుడు స్టీఫెన్‌ లూబీ వెల్లడించారు. దీన్ని తాగునీటిపంపునకు అమర్చితే, దాని నుంచి వచ్చే నీటిలోకి అవసరమైనంత క్లోరిన్‌ను విడుదల చేస్తుందన్నారు. ఇది పని చేసేందుకు విద్యుత్‌ కూడా అవసరం లేదన్నారు. ఆక్వాటాబ్స్‌ను బంగ్లాదేశ్‌లోని ఢాకాలో ప్రయోగాత్మకంగా పరిశీలించామన్నారు.