ఫ్లోరైడ్‌తో టీనేజర్లకు ముప్పు!

 

10-08-2019: నీటిలో ఫ్లోరైడ్‌ ఎక్కువగా ఉంటే టీనేజర్లకు ముప్పుగా పరిణమిస్తుందని తాజా సర్వే పేర్కొంది. ఎన్విరాన్‌మెంట్‌ ఇంటర్నేషనల్‌ అనే జర్నల్‌లో ఈ వివరాలు ప్రచురించారు. దంతాలు పటిష్ఠంగా ఉండేందుకు అమెరికాలోని ప్రజా తాగునీటి సరఫరాలో ఫ్లోరైడ్‌ కలుపుతారు. అయితే ఇది టీనేజర్లకు ప్రతికూలంగా మారుతోందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు. అధ్యయనంలో భాగంగా.. 1983 మంది టీనేజర్ల రక్త నమూనాలు, 1742 ఇళ్లలోని ట్యాప్‌ వాటర్‌ను సేకరించి పరీక్షించారు.