కాస్త వాయు కాలుష్యంతోనూ హృద్రోగం ముప్పు

మెల్‌బోర్న్‌, జనవరి 29 : వాయు కాలుష్యం మోతాదు ఎంత తక్కువగా ఉన్నా దాని ప్రభావంతో హృద్రోగాల ముప్పు తప్పదని ఆస్ట్రేలియాలోని సిడ్నీ వర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ ముప్పు వృద్ధులకు మరీ ఎక్కువగా ఉంటుందన్నారు. ఆకస్మిక గుండెపోటుతో మృతిచెందుతున్న వారిలో 90 శాతం మంది అతి తక్కువ వాయుకాలుష్యం కలిగిన ప్రాంతాలవారేనని అధ్యయనంలో గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో గాలిలో ధూళికణాల మోతాదు(పర్టిక్యులేట్‌ మేటర్‌) 2.5 కంటే తక్కువగా ఉన్నా హృద్రోగ సమస్యలు తలెత్తిన విషయాన్ని విస్మరించలేమన్నారు. బొగ్గును మండించడం, అడవుల్లో కార్చిచ్చులు, మైనింగ్‌, వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే పొగల కారణంగా మనం పీల్చే గాలి నాణ్యత తగ్గుతోందన్నారు.