లింఫోసైట్లు తగ్గితే ప్రాణాలకు ముప్పు

లండన్‌, జనవరి 13: రక్తంలో లింఫోసైట్లు(ఒక రకమైన తెల్లరక్తకణాలు) తగ్గడం ప్రాణాలకు ముప్పని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. లింఫోసైట్లు తగ్గడాన్ని వైద్య పరిభాషలో లింఫోపీనియా అంటారు. సాధారణ రక్త పరీక్షల్లో కూడా ఇది బయటపడుతుంది. లింఫోసైట్లు రోగనిరోధక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటి సంఖ్య బాగా పడిపోవడం వల్ల ఆ శక్తి తగ్గిపోతుంది. ఇది అన్ని వయసుల వారి ప్రాణాలకు ముప్పే. డెన్మార్క్‌లోని కోపెన్‌హెగెన్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు దాదాపు 12 ఏళ్లపాటు 1,08,135 మందిపై పరిశోధనలు చేసి ఈ విషయాన్ని వెల్లడించారు.