వాయు కాలుష్యంతో పిల్లలకు ‘స్కిజోప్రీనియా’

 

లండన్‌, జనవరి 8: వాయు కాలుష్యంతో శారీరక సమస్యలు తలెత్తడంతో పాటు మానసిక ఆరోగ్యమూ దెబ్బతింటుందని డెన్మార్క్‌లోని ఆర్హస్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. ముఖ్యంగా గాలిలో కాలుష్య కారకాల మోతాదు(పర్టిక్యులేట్‌ మ్యాటర్‌) అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో నివసించే పిల్లలు ‘స్కిజోప్రీనియా’ వ్యాధి బారినపడే అవకాశాలు ఉంటాయని హెచ్చరించారు. బాధితుల్లో మానసిక కల్లోలం నిత్యప్రక్రియగా మారుతుంది. వారు భ్రమలు, అపోహలు, అనుమానాల చట్రంలో జీవిస్తుంటారు. మనుషులకు జీవితకాలంలో స్కిజోప్రీనియా వచ్చే అవకాశాలు 2ు ఉంటే.. వాయు కాలుష్యభరిత పరిసరాల్లో నివసించేవారికి దాని ముప్పు 3శాతం దాకా ఉంటుందని వెల్లడించారు.