పొట్ట భాగంలో కొవ్వు పెరిగితే రోగాల ముప్పు

 

న్యూయార్క్‌, నవంబరు 16: వయసు పెరుగుతున్న కొద్దీ పొట్ట భాగంలో ఉండే కొవ్వు పెరగడంతో వ్యాధులు ముసురుకుంటున్నాయని అమెరికాలోని యేల్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. వయసు పైబడినవారిలో కొవ్వు కరిగేందుకు దోహదపడే వ్యాధినిరోధక కణాలు(అడిపోస్-బి) తగ్గుముఖం పడుతున్నట్లు అధ్యయనంలో గుర్తించారు. దీని ప్రభావంతో పొట్టభాగంలో కొవ్వు పెరిగి.. జీవక్రియల రేటు, వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లుతోందని తెలిపారు. వృద్ధులు మధుమేహం బారిన పడటానికి ఈ పరిణామమే కారణమని తెలిపారు.