అధిక బీఎంఐతో కేన్సర్‌ కట్టడి

వాషింగ్టన్‌, డిసెంబరు 29 : శరీర బరువు(బీఎంఐ) అధికంగా ఉన్నవారికి వ్యాధుల ముప్పు అధికంగా ఉంటుందని సాధారణంగా అంటుంటారు!! కానీ ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మాత్రం బీఎంఐ ఎక్కువగా ఉన్నవారికి కేన్సర్‌తో పోరాడి గెలిచే వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ప్రయోగ పరీక్షల్లో భాగంగా ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతున్న రోగులకు అటెజోలిజ్యుమాబ్‌ థెరపీ ద్వారా చికిత్స అందించారు. అనంతరం ఆరోగ్య నివేదికలను పరిశీలించగా.. బీఎంఐ అధికంగా ఉన్నవారిలో కేన్సర్‌ గణనీయ స్థాయిలో అదుపులోకి వచ్చినట్లు గుర్తించారు.