అక్టోబరు నుంచి ‘వైఎస్సార్‌ కంటి వెలుగు’

అమరావతి, 18-09-2019: గతంలో ఏ ప్రభుత్వం చేయనివిధంగా రాష్ట్రంలో వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమాన్ని అమలు చేస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. విజయవాడ సిద్ధార్థ మెడికల్‌ కాలేజీలో మంగళవారం ఏర్పాటు చేసిన కంటివెలుగు వర్క్‌షాపును ఆయన ప్రారంభించారు.