మెరిసే మేనిఛాయ

ఆంధ్రజ్యోతి (08-01-2019): చర్మాన్ని కాలుష్యం, అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడి... చర్మం యవ్వనంగా కనిపించేలా చేయడంలో విటమిన్‌ సి ఉన్న సౌందర్య ఉత్పత్తులు తోడ్పడతాయి. అందుకే మాయిశ్చరైజర్‌, ఫేస్‌మాస్క్‌ వంటి చర్మసంరక్షణ ఉత్పత్తుల్లో విటమిన్‌ సి వాడకం ఎక్కువ.
 
కొల్లాజెన్‌ ఉత్పత్తి: చర్మం మీద ముడతలు, గీతలు ఏర్పడడానికి ప్రధాన కారణం కొల్లాజెన్‌ ప్రొటీన్‌ తక్కువ అవడం. విటమిన్‌ సి కొల్లాజెన్‌ ఉత్పత్తిని ప్రేరేపించి చర్మం తాజాగా, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. విటమిన్‌ సి ఉన్న సీరమ్‌ ఫేస్‌క్రీమ్స్‌, టోనర్స్‌ కన్నా మెరుగ్గా పనిచేస్తుంది.
 
తాజా చర్మం: విటమిన్‌ సిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఒంట్లోని విషపదార్థాలను తొలగించి చర్మానికి నిగారింపు, మెరుపును ఇస్తాయి. ఇన్‌ఫెక్షన్లు సోకకుండా చూస్తాయి.
 
హైపర్‌పిగ్మెంటేషన్‌: మెలనిన్‌ ఉత్పత్తిలో హెచ్చుతగ్గుల వల్ల చర్మం రంగు మారడం వంటి సమస్యలు వేధిస్తుంటాయి. వీటికి విటమిన్‌ సి మందుగా పనిచేస్తుంది.
 
కళ్ల కింద వలయాలు: విటమిన్‌- సి లోని సీరమ్‌ కళ్ల కింది వలయాలను మాయం చేస్తుంది. అంతేకాదు కళ్లు ఎరుపెక్కడం కూడా తగ్గిపోతుంది.