మంచమే.. అంబులెన్స్‌

21-07-2019: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని గొత్తికోయ గూడెం వాసి ఎట్టి విజికి శనివారం పురిటి నొప్పులు రావడంతో కట్టెకు మంచాన్ని కట్టి 7 కిలోమీటర్ల దూరంలోని బయ్యక్కపేటకు తరలించబోయారు. పురిటి నొప్పులు అధికమై అటవీ ప్రాంతంలోనే విజి ప్రసవించింది. తల్లి, శిశువు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.