గర్భిణుల కోసం ప్రత్యేక హెల్ప్‌ డెస్క్‌లు

రాష్ట్ర వ్యాప్తంగా గర్భిణుల కోసం ప్రత్యేకంగా హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు కానున్నాయి. అన్ని బోధనాస్పత్రులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌(టీవీవీపీ) ఆస్పత్రుల్లో వీటిని నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. 24 గంటలు అందుబాటులో ఉండేలా కౌన్సెలర్లు, కోఆర్డినేటర్లను ఈ హెల్ప్‌డె్‌స్కల్లో నియమిస్తారు. వీటి ఏర్పాటుపై జిల్లా అధికారులందరికీ వైద్య,ఆరోగ్యశాఖ ఆదేశాలిచ్చింది. తొలుత హైదరాబాద్‌ జిల్లాల పరిధిలో వీటిని ఏర్పాటు చేస్తారు. తదుపరి దశలవారీగా రాష్ట్రమంతా వీటిని అందుబాటులోకి తీసుకువస్తారు.