ధూమపానంతో కుంగుబాటు!

జెరూసలెం, జనవరి 9: ధూమపానం శారీరక ఆరోగ్యానికే కాదు.. మానసిక ఆరోగ్యానికీ చేటు చేస్తుందని ఇజ్రాయుల్‌లోని జెరూసలెంలో ఉన్న హిబ్రూ యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. ఈ మేరకు భిన్న నేపథ్యాలున్న 2 వేల మంది సెర్బియన్‌ వర్సిటీల విద్యార్థులపై సర్వే నిర్వహించగా.. పొగ తాగనివారి కంటే తాగేవారు కుంగుబాటుకు గురయ్యే ప్రమాదం ఆరు రెట్లు అధికమని స్పష్టమైంది. ప్రిస్టినా విశ్వవిద్యాలయంలో స్మోకర్స్‌లో 14 శాతం మంది కుంగుబాటును ఎదుర్కొనగా.. నాన్‌ స్మోకర్స్‌లో కేవలం 4 శాతం మందే దాని బారినపడ్డారు. బెల్‌గ్రేడ్‌ వర్సిటీలో ఈ వ్యత్యాసం19- 11 శాతంగా సర్వే పేర్కొంది.