షుగర్ వ్యాధికి కాలం చెల్లిపోయినట్లే ?

ఆంధ్రజ్యోతి(25-10-2016): షుగర్ వ్యాధి ఎంతోమందిని నానా ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇక షుగర్ వ్యాధికి రోజులు చెల్లిపోయినట్లుగా భావించవచ్చు. వరంగల్ రూరల్ జిల్లాలో పూర్తీగా సేంద్రియ ఎరువులతో షుగర్ ఫ్రీ రైస్ సాగవుతోంది. వివిధ రకాల ఔషద గుణాలు కలిగిన ఎరువును ఉపయోగించి ఈ రైస్‌ను సాగు చేస్తున్నారు. ఈ రైస్ వాడితే శరీరంలోని గ్లూకోజ్ లెవల్స్ తగ్గుతాయట. రైస్‌ని ఉపయోగించిన వారికి షుగర్ నుంచి చాలా మేరకు ఉపశమనం కలగడం ఖాయమని వైద్యలు పేర్కొంటున్నారు. త్వరలోనే ఈ రైస్ అందుబాటులోకి పెద్దసమస్య తీరినట్లేనని అభిప్రాయపడుతున్నారు.