కార్బన్‌డైఆక్సైడ్‌ను తినే బ్యాక్టీరియా

జెరూసలేం, నవంబరు 28: కార్బన్‌డైఆక్సైడ్‌ను శక్తివనరుగా ఉపయోగించుకొనే బ్యాక్టీరియా జాతిని ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ-కొలి అనే బ్యాక్టీరియాను కృత్రిమ పద్ధతుల ద్వారా కార్బన్‌డైఆక్సైడ్‌ను తీసుకునేదిగా మార్చామని వారు చెప్పా రు. వాతావరణంలో గ్రీన్‌హౌస్‌ వాయువులను తగ్గించడంలో ఈ బ్యాక్టీరియా ఉపయోగపడుతుందన్నారు. భవిష్యత్తులో పర్యావరణహితమైన జీవ ఇంధన తయారీలో ఈ బ్యాక్టీరియాలను ఉపయోగించే అవకాశం ఉందని, ఇవి సంప్రదాయ జీవ ఇంధనాల కంటే తక్కువ కాలుష్య ఉద్గారాలను విడుదల చేస్తాయని వెల్లడించారు.