కలువ పూల జన్యువుల్లో.. పుష్పించే మొక్కల పరిణామ రహస్యం

వాషింగ్టన్‌, జనవరి 5 : నింఫే కొలొరాటా జాతి కలువ పూల జన్యువుల లోగుట్టును తెలుసుకునేందుకు అమెరికాలోని పెన్సిల్వేనియా వర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. అధ్యయనంలో భాగంగా ఆ పుష్పంలోని 14 క్రోమోజోమ్‌లు, 31వేల పైచిలుకు జన్యుప్రోటీన్లను విశ్లేషించారు. ఈ సమాచారంతో పుష్పించని మొక్కల జాతికి చెందిన ఆంబోరెల్లా పొదల జన్యువుల స్వరూప, స్వభావాలను పోల్చి చూశారు. ఈ అధ్యయన ఫలితాలు.. పరిణామక్రమంలో పుష్పించని మొక్కలు(జిమ్నోస్పెర్మ్‌), పుష్పించే మొక్కలు(యాంజియో స్పెర్మ్‌)గా మారడానికి గల కారణాలను తెలుసుకునేందుకు దోహదపడతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. కలువ పూలలో ఉండే స్త్రీ, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థల అధ్యయనం ఆధారంగా పుష్పించే మొక్కల జాతుల పరిణామ క్రమంపై ఓ స్పష్టతకు రావచ్చన్నారు.