పక్షవాత బాధితులు నడవొచ్చు

ఆంధ్రజ్యోతి(27-10-2016): ఎక్సోస్కెలెటిన్‌ రోబోతో కాళ్లకు దన్నుచైనా వర్సిటీ విద్యార్థుల ఆవిష్కరణ
 పక్షవాతంతో మంచానికే పరిమితమైన వారిని తిరిగి నడిపించేందుకు ప్రత్యేకంగా తయారుచేసిందే ఈ ఫొటోలోని రోబో ఎక్సోస్కెలెటిన్‌.. కీళ్ల కదలికలకు తగినంత ఊతమిచ్చేందుకు ఈ రోబో తోడ్పడుతుందట! వెన్నెముక దెబ్బతినడంవల్ల చక్రాల కుర్చీకి అంటుకుపోయిన వారు దీని సాయంతో అడుగులేయవచ్చని బీహాంగ్‌ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. డెన్మార్క్‌లోని ఆల్‌బోర్గ్‌ వర్సిటీ శాస్త్రవేత్తల సహకారంతో సంయుక్తంగా ఈ రోబో ఎక్సోస్కెలెటిన్‌ను తయారుచేశామని వివరించారు. పక్షవాతం కారణంగా చచ్చుబడిపోయిన అవయవాలు ఫిజియోథెరపీతో కొంతమేర స్వాధీనంలోకి రావడం తెలిసిందే.. అదేవిధంగా ఈ రోబోతో కీళ్ల కదలికలకు తోడ్పడవచ్చని, బాధితులు రోజువారీ పనులను సొంతంగా చేసుకునేలా చేయవచ్చని వారు వివరించారు. ఇందుకోసం మానవ శరీర నిర్మాణాన్ని నిశితంగా అధ్యయనం చేశామని వర్సిటీ ప్రొఫెసర్‌ వీహెయ్‌ చెన్‌ చెప్పారు.