ఆరోగ్యవంతులకు క్యాల్షియం, విటమిన్‌-డీ మాత్రలు అక్కర్లేదు!!

ఆక్లాండ్‌, నవంబరు 29 : చాలామంది ఆరోగ్యవంతులూ క్యాల్షియం, విటమిన్‌-డీ మాత్రలు ఎడాపెడా వాడేస్తుంటారు.. అది కూడా వైద్యుల సలహా తీసుకోకుండానే!! ఇలా చేయడం వల్ల సానుకూల ఫలితాలు రాకపోగా.. మలబద్ధకం, కిడ్నీలో రాళ్లు, జీర్ణాశయ కండరాలు కుచించి పొట్ట పెరగడం, గుండెజబ్బులు, గ్యాస్ట్రిక్‌ సమస్యలు రావచ్చట!! ఆస్ట్రేలియాలోని ఆక్లాండ్‌ వర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. విటమిన్‌-డీ లోపం లేనివారు.. బోలు ఎముకల వ్యాధిగ్రస్తులు, వయసు పైబడినవారు మాత్రమే ఈ మాత్రలు వాడటం మంచిదన్నారు. ఎండ ద్వారా శరీరానికి విటమిన్‌-డీ అందుతుందనే సంగతి మనకు తెలిసిందే.