పిల్లల దృష్టిలోనూ పురుషులే శక్తిమంతులు!

ప్యారిస్‌, జనవరి 12: మహిళల కంటే పురుషులే శక్తిమంతులనే అభిప్రాయాన్ని పిల్లలు వ్యక్తపరుస్తున్నారని ఫ్రాన్స్‌లోని ఫ్రెంచ్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సైంటిఫిక్‌ రిసెర్చ్‌ అధ్యయనంలో తేలింది. స్త్రీ, పురుషు ల్లో శారీరక దృఢత్వం, ఆర్థిక సమృద్ధి, లైంగిక సమానత్వం అనే అంశాలు ప్రాతిపదికగా లెబనాన్‌, ఫ్రాన్స్‌, నార్వే దేశాల్లో మూడు నుంచి ఆరేళ్లలోపు పలువురు చిన్నారుల అభిప్రాయాలను సేకరించారు. వారి అభిప్రాయాలను నమోదు చేసి విశ్లేషించగా, పురుషులు శక్తిమంతులనే ఫలితం వచ్చింది.