ప్రసూతి మరణాలు దక్షిణాదిలోనే తక్కువ

 

దేశంలో ప్రతి లక్ష జననాలకు 122 మంది తల్లులు మృతి
 
హైదరాబాద్‌, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): దేశంలో ప్రసవ సమయంలో గర్భిణుల మరణాలపై రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ఒక నివేదిక వెలువరించింది. దాని ప్రకారం దక్షిణాది రాష్ట్రాల్లో మెటర్నల్‌ మోర్టాలిటీ రేట్‌ (ఎంఎంఆర్‌) తగ్గింది. ఉత్తరాదితో, దేశ సగటుతో పోల్చినా కూడా దక్షిణాదిలో ప్రసూతి మరణాలు తక్కువే. రాష్ట్రాలను 3 గ్రూపులుగా చేసి సర్వే చేపట్టారు. ఆ నివేదిక ప్రకారం...

దేశంలో ప్రతి లక్ష జననాలకు 122 మంది తల్లులు ప్రాణాలు కోల్పోతున్నారు. 2014-16లో మెటర్నల్‌ మోర్టాలిటీ రేటు 130గా ఉంటే 2015-17 నాటికి 122కు తగ్గింది. ఎంఎంఆర్‌... దక్షిణాది రాష్ట్రాల్లో 72గా ఉంటే మిగతా రెండు గ్రూపుల్లో 175, 90గా ఉంది. అత్యధికంగా అసోంలో ప్రతి లక్షకు 229, అత్యల్పంగా కేరళలో 42 మరణాలు సంభవిస్తున్నాయి. మృతుల్లో 20 నుంచి 24 ఏళ్లలోపు వయసు మహిళలే ఎక్కువగా ఉంటున్నారు.