నిమ్స్‌లో మాస్టర్‌ హెల్త్‌ చెకప్‌ ప్యాకేజీలు

రూ. 5 వేలకు 16 రకాల ఆరోగ్య పరీక్షలు

బేగంపేట/హైదరాబాద్‌, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): నిమ్స్‌లో మాస్టర్‌ హెల్త్‌ చెకప్‌ ప్యాకేజీలను ప్రారంభించినట్లు ఆస్పత్రి ఎంఎస్‌ నిమ్మ సత్యనారాయణ తెలిపారు. రూ.5 వేలకు మాస్టర్‌ హెల్త్‌ చెకప్‌ చేస్తారని, ఇందులో 16 రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. ఎగ్జిక్యూటివ్‌ మాస్టర్‌ హెల్త్‌ చెక్‌పలో 23 రకాల ఆరోగ్య పరీక్షలను నిర్వహిస్తారని స్తీలకు రూ. 9వేలు, పురుషులకు రూ. 8వేలు ఫీజుగా నిర్ణయించారని తెలిపారు. శుక్రవారం ఆస్పత్రిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.