ఈ నెల 26 నుంచి కుష్ఠు, టీబీ స్ర్కీనింగ్‌

హైదరాబాద్‌, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): క్షయ, కుష్ఠు రోగుల గుర్తింపునకు ఈ నెల 26 నుంచి సెప్టెంబరు 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక స్ర్కీనింగ్‌ కార్యక్రమాన్ని నిర్వహించాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు వారివారి గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ప్రజలకు సంబంధిత వైద్యపరీక్షలు చేయనున్నారు.