4 ఆస్పత్రులకు కాయకల్ప అవార్డులు

12-10-2019: మెరుగైన వైద్య సదుపాయాలు కలిగి ఉత్తమ పనితీరు కనబర్చిన ప్రభుత్వ ఆస్పత్రులకు కేంద్రం కాయకల్ప అవార్డులను ప్రకటించింది. తెలంగాణకు చెందిన 4 ఆస్పత్రులకు అవార్డులు దక్కాయి. కామారెడ్డి జిల్లా ఆస్పత్రి మొదటి స్థానం, సంగారెడ్డి, కొండాపూర్‌ జిల్లా ఆస్పత్రులకు ద్వితీయ స్థానం అవార్డు లభించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం విభాగంలో పాల్వంచ కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌కు అవార్డు వచ్చింది. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ చేతుల మీదుగా ఆయా ఆస్పత్రుల ప్రతినిధులు అవార్డులను అందుకున్నారు.