అక్టోబరు 10 నుంచి 2022 వరకు కంటి వెలుగు

అమరావతి, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): ‘వైఎస్సార్‌ కంటి వెలుగు’ పథకం కింద ప్రజలను స్ర్కీనింగ్‌ చేయనున్నారు. అక్టోబరు నెలలో వచ్చే రెండో గురువారం నిర్వహించే(అక్టోబరు 10న) ‘వరల్డ్‌ సైట్‌ డే’ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు శుక్రవారం అధికారులు షెడ్యూల్‌ విడుదల చేశారు. ఈ పథకం అమలుకు ప్రభుత్వం రూ.560.89 కోట్లు కేటాయించింది. వైద్య పరికరాలు, మందులు, కళ్లజోళ్లను కొనుగోలు చేసే బాధ్యతను రాష్ట్ర వైద్య విధాన్‌ పరిషత్‌ కమిషనర్‌కు అప్పగించారు. ఈ కార్యక్రమాన్ని 2022 జనవరి వరకు నిర్వహిస్తారు.