వైద్య సేవలు ‘డ్రోన్‌ డెలివరీ’

హైదరాబాద్‌, జూలై 18(ఆంధ్రజ్యోతి): భారీ ప్రమాదాలు జరిగినప్పుడు వైద్యసాయం అందక మరణించేవారి సంఖ్యను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభు త్వం డ్రోన్‌ సాయాన్ని తీసుకోనుంది. అత్యవసర పరిస్థితుల్లో రక్తం, మందులు వంటివి ఆస్పత్రులకు చేరవేసేందుకు ‘డ్రోన్‌ డెలివరీ’ అనే ఆకాశమార్గంలో ప్రయాణించే విధానాన్ని రూపొందించింది.దేశంలో ఇలాంటి ప్రాజెక్టుకు తెలంగాణలోనే తొలిసారిగా అమలు చేయనున్నారు. ఈ మేరకు ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, వరల్డ్‌ ఎకనామిక్‌, సెంటర్‌ ఫర్‌ ఫోర్త్‌ ఇండస్ట్రియల్‌ రెవల్యూషన్‌ నెట్‌వర్క్‌, హెల్త్‌నెట్‌ గ్లోబల్‌ సంస్థల ప్రతినిధులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. తర్వాత పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తారు.