కేన్సర్‌ను ముందుగా గుర్తించే ‘ఆంకోడిస్కవర్‌’

ముంబై, ఆగస్టు 19: కేన్సర్‌ను మొదటి దశలోనే గుర్తించే సాంకేతికతను పుణెలో ఆక్టోరీస్‌ అనే సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. రక్తపరీక్ష ద్వారా కేన్సర్‌ వ్యాప్తిని గుర్తించే ఈ టెక్నాలజీకి ‘ఆంకోడిస్కవర్‌’ అని పేరు పెట్టారు. దీనికి సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ ఆమోదం తెలిపింది. ‘‘కేన్సర్‌ను ముందుగానే గుర్తించడంలో ఈ టెక్నాలజీ విప్లవాత్మకమైనది. ఆంకోడిస్కవర్‌ ప్రపంచంలోనే అత్యంత వేగంగా కేన్సర్‌ను గుర్తించగలదు’’ అని స్టార్ట్‌పకు చెందిన డాక్టర్‌ జయంత్‌ ఖండారే తెలిపారు. కేన్సర్‌ను మొదటి దశలోనే గుర్తించగలిగితే కేన్సర్‌ మరణాలను చాలావరకు తగ్గించవచ్చని ఆయన వివరించారు.