గద్వాల ఆస్పత్రికి డయాలసిస్‌ యంత్రాలు

గద్వాల, జూలై 18 (ఆంధ్రజ్యోతి): జోగుళాంబ గద్వాల జిల్లా ప్రధాన ఆస్పత్రికి నాలుగు డయాలసిస్‌ యంత్రాలు వచ్చాయి. జూన్‌ 30న ఆంరఽధజ్యోతిలో ప్రచురితమైన ‘డయాలసిన్‌ స్లాట్‌ లేదు’ కథనానికి రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ స్పందించింది. గద్వాల ప్రధాన ఆస్పత్రికి ఐదు డయాలసిస్‌ యంత్రాలు రావాల్సి ఉండగా నాలుగు యంత్రాలను పంపించారు. ఈ యంత్రాలతో 40 మంది డయాలసిస్‌ రోగులకుఉచితంగా చికిత్స చేయించుకునే అవకాశం కలుగనుంది. జిల్లాలో నిత్యం డయాలసిన్‌ చికిత్స కోసం 150 రోగులు ఎదురు చూస్తున్నారు. ఈ రోగుల్లో కొంత మందికైనా ఉపయోగం ఉంటుంది. ఎట్టకేలకు గద్వాల ఎమ్మెల్యే పోరాటం ఫలించినట్లయ్యింది.