హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న రోగులు

ఖైరతాబాద్‌, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి) : ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా నవంబర్‌ 14ను ప్రపంచ డయాబెటిస్‌ డేగా ప్రకటించింది. కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ డయాబెటిస్‌ పట్ల అవగాహన కల్పిస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించడమే లక్ష్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహిస్తోంది.

30 నుంచి 50 ఏళ్ల వయస్సు వారిలో..
జంక్‌ ఫుడ్స్‌ తీసుకునేవారి సంఖ్య పెరగడం, శారీరక వ్యాయామం లేకపోవడం, ఒత్తిడితో కూడిన పనుల వల్ల హైదరాబాద్‌లో డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా 30 నుంచి 50 సంవత్సరాల వయస్సు గల వారు వ్యాధి బారిన పడుతున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. 
 
డైట్‌, వ్యాయామం కీలకం
డయాబెటిస్‌ బారిన పడకుండా, ఒకవేళ వచ్చినా అదుపులో ఉంచుకునేందుకు ఆహార నియమాలు చాలా ముఖ్యం. తక్కువ ఆహారాన్ని ఎక్కువ సార్లు తీసుకోవడం, జంక్‌ పుడ్స్‌, నిల్వ ఉండే కార్బొహైడ్రేట్స్‌ , నూనెలో బాగా వేయించిన, మాడ్చిన ఆహారం మానేయాలి. సైక్లింగ్‌, వాకింగ్‌, స్విమ్మింగ్‌ ఉపయోగపడతాయి. పనిచేసే చోట ఒత్తిడిని తగ్గించుకోవాలి. రోజూ 6 నుంచి 8 గంటల మంచి నిద్ర ఉంటే డయాబెటిస్‌ బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు. 
-  డాక్టర్‌ శ్రీనివాసులు, డయాబెటాలజిస్ట్‌, జనరల్‌ ఫిజిషియన్‌, గ్లెనిగల్స్‌ గ్లోబల్‌ ఆసుపత్రి