ప్రసవ వేదన

పాచిపెంట, సెప్టెంబరు 19: ఆ గ్రామం నుంచి బయటకు వెళ్లాలంటే గెడ్డలో నుంచే ప్రయాణించాలి. వర్షాకాలంలో నిత్యం నరకయాతన అనుభవిస్తున్న విజయనగరం జిల్లా పాచిపెంట మండలం ఈతమానువలస గ్రామస్థుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తాజాగా గ్రామానికి చెందిన గర్భిణి లావుడిజన్ని కస్తూరికి బుధవారం అర్ధరాత్రి నుంచి నొప్పులు రావడంతో డోలీ సాయంతో తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు గురువారం ఉదయం ఆస్పత్రికి బయలుదేరారు. గెడ్డలో నుంచి సుమారు కిలోమీటరున్నర దూరం నడిచాక అప్పటికీ 108 వాహనం రాక ఆటోపై స్థానిక పీహెచ్‌సీకి తీసుకువెళ్లారు. మాసాలగెడ్డపై వంతెన నిర్మించని కారణంగా తరచూ ఈ గ్రామస్థులకూ తిప్పలు తప్పడం లేదు.