రోజుకు ఒకసారి మద్యం తాగినా.. కేన్సర్‌ ముప్పు!!

 

టోక్యో, డిసెంబరు 10: మద్యంప్రియులూ తస్మాత్‌ జాగ్రత్త!! రోజుకు ఒకసారి మద్యం తాగేవారూ కేన్సర్‌ బారిన పడుతున్నారని జపాన్‌లోని టోక్యోవర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. మద్యం తాగేవారికి పొట్ట, రొమ్ము, పెద్దపేగు, గొంతు, ప్రొస్టేట్‌ కేన్సర్‌ ముప్పు ఉన్నట్లు గుర్తించారు. మద్యం రోజూ ఎంత మోతాదులో తాగుతున్నారనే దానికంటే.. ఎంతకా లంగా తాగుతున్నారనేదే ముఖ్యమని పేర్కొన్నారు.