పేదింటి బిడ్డకు పెద్ద జబ్బు!

 

మంచానికే పరిమితమైన భాస్కర్‌..
ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు

శాయంపేట, జూలై 20: అతడు ఆర్థికంగా నిరుపేద.. అయితేనేం ఆలోచనల్లో స్థితిమంతుడు.. అద్భుత చిత్రాలు గీసే ప్రతిభావంతుడు.. అవార్డులు, సన్మానాలు ఎన్నో దక్కాయి.. కాని, ఇప్పుడు ఆ చిత్రకారుడికి అనారోగ్యం అడ్డంకిగా మారింది. జీవన్మరణ స్థితికి చేర్చింది. బ్రెయిన్‌ మెనింజైటిస్‌ వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమయ్యాడు. దీంతో ఆపన్నుల చేయూత కోసం ఆ నిరుపేద కుటుం బం వేచి చూస్తోంది. వరంగల్‌ రూరల్‌ జిల్లా శాయంపేట మండలం మైలారానికి చెందిన భాస్కర్‌ ఇంటర్‌ వరకు జాకారంలో, ఆ తర్వాత హైదరాబాద్‌ జెఎన్‌టీయూలో మాస్టర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ పూర్తి చేశాడు. అనంతరం పలు ప్రైవేట్‌ పాఠశాలల్లో డ్రాయింగ్‌ ఉపాధ్యాయుడిగా పని చేశాడు. గతేడాది డిసెంబరు నుంచి తలనొప్పి, జ్వరం రావడంతో వరంగల్‌ ఎంజీఎం, హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు.

మెనింజైటిస్‌ వ్యాధి ఉందని వైద్యులు చెప్పటంతో భాస్కర్‌ తల్లిదండ్రులు అప్పుచేసి ఈ ఏడాది మార్చిలో రూ.7లక్షలతో ఆపరేషన్‌ చేయించారు. పది రోజులపాటు మంచిగానే ఉండడంతో డిశ్చార్జి చేశారు. ఇంటికి వచ్చిన వారం రోజులకు అకస్మాత్తుగా కళ్లు తిరగడం, మెదడు మొద్దుబారడం, మనుషులను గుర్తించకపోవడంతో పాటు పక్షవా తం వచ్చింది. దీంతో మళ్లీ నిమ్స్‌కు తీసుకెళ్లగా బ్రెయిన్‌ ఎడమ వైపున ఆపరేషన్‌ చేయాలని, ఇందుకు రూ. 10లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. దీంతో ప్రభుత్వం, ఆపన్ను లు ఆర్థికసాయం చేయాలని భాస్క ర్‌ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

 

భాస్కర్‌ బ్యాంకు వివరాలు

అరికెల్ల భాస్కర్‌ ఎస్‌బీఐ శాయంపేట
ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్‌: ఎస్‌బీఐఎన్‌0005325
బ్యాంకు ఖాతా నెంబర్‌: 32142999239
సెల్‌ నెంబర్‌: 9949589818