ఆత్మహత్యల కారణాలు పసిగట్టే కృత్రిమ మేధ

బోస్టన్‌, డిసెంబరు 10: ఆత్మహత్యల కారణాలను పసిగట్టే మెషీన్‌ లెర్నింగ్‌ సాంకేతికతను అమెరికాలోని బోస్టన్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు. 1995 నుంచి 2015 మధ్యకాలంలో ఆత్మహత్యలకు పాల్పడిన 14,103 మంది డెన్మార్క్‌ దేశస్థుల ఆరోగ్య నివేదికల సమాచారాన్ని కృత్రిమ మేధస్సు(ఆర్టిఫీషియల్‌ ఇంటెలీజెన్స్‌)తో పనిచేసే మెషీన్‌ లెర్నింగ్‌తో విశ్లేషించారు. బలవన్మరణాలకు పాల్పడిన పురుషుల్లో అత్యధికులు ఆరోగ్య సమస్యలు, రోడ్డు ప్రమాదాల బారినపడిన వారేనని గుర్తించారు.