24 గంటల్లో 22 ప్రసవాలు!

జనగామ ఎంసీహెచ్‌ వైద్యుల రికార్డు
అభినందించిన మంత్రి ఈటల

జనగామ, 21-09-2019: జనగామ మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో(ఎంసీహెచ్‌) కేవలం 24 గంటల్లోనే 22 ప్రసవాలు చేసి డాక్టర్లు రికార్డు సృష్టించారు. డాక్టర్‌ ప్రణతి ఆధ్వర్యంలోని వైద్య సిబ్బంది గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల వరకు 22 ప్రసవాలు చేశారు. 16 మంది మొదటి కాన్పుకోసం చేరగా 15 మందికి సాధారణ ప్రసవాలు జరిగాయి. ఐదుగురికి శస్త్ర చికిత్స ద్వారా ప్రసవం చేశారు. ఇన్ని కాన్పులు చేసిన వైద్య సిబ్బందిని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అభినందించారు.