వెన్నెముక బలానికి...

11-06-2019:వ్యాయామాల ద్వారా బాడీ ఫిట్‌గా మారుతుంది. అయితే వీపు భాగంలోని కండరాలను చక్కని ఆకృతిలోకి తేవడానికి ఎక్కువ సమయమే పడుతుంది. ఎందుకంటే ఈ భాగంలో కండరాల అమరిక చిన్న, పెద్ద కండరాలతో నిండి ఉంటుంది. అయితే అయిదు రకాల వ్యాయామాలతో దృఢమైన వెన్నెముకను సొంతం చేసుకోవచ్చు అంటున్నారు ఫిట్‌నెస్‌ నిపుణులు. అవేంటంటే...
 
వైడ్‌ గ్రిప్‌ పుల్‌ అప్స్‌
ఈ వ్యాయామం వీపు పై భాగంలోని కండరాల మీద ప్రభావం చూపిస్తుంది. మెరుగైన ఫలితాల కోసం వెయిటెడ్‌ బెల్టును ఉపయోగిస్తే బరువు పడి, కండరాలు షేపులోకి వస్తాయి. కండరాలు బాగా కనిపించేందుకు పుల్‌అ్‌ప్సతో పాటు బరువులు పెంచుకుంటూ పోవడం ముఖ్యమే. ఈ వ్యాయామం చేసేటప్పుడు గ్రిప్‌ సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి.
 
బెంట్‌ ఓవర్‌ బార్‌బెల్‌ రోవింగ్‌
దీంతో వెన్నెముకకు చక్కని వ్యాయామం లభిస్తుంది. ఎక్కువ బరువులు ఎత్తాల్సి ఉంటుంది. మంచి గ్రిప్‌ ఉన్న డంబెల్స్‌ను ఎంచుకోవాలి. వీపు భాగాన్ని నేలపై సమాంతరంగా ఉంచి, మోకాళ్లను కొద్దిగా ముందుకు వంచాలి. బరువులు ఎత్తేటప్పుడు శరీరాన్ని అటూ ఇటూ కదిలించకూడదు. సరైన పొజిషన్‌లో ఉండడం చాలా ముఖ్యం.
 
టి-బార్‌ రోవింగ్‌
బార్‌బెల్‌ గ్రిప్‌ మార్చి వీపు కండరాల్ని పటిష్ఠం చేసే పలు వ్యాయామాలు చేయొచ్చు. పెద్ద గ్రిప్‌ బార్‌బెల్‌తో ఎక్సర్‌సైజ్‌లు చేస్తే కండరాలు
మంచి ఆకృతిలోకి వస్తాయి. చిన్న గ్రిప్‌ బార్‌బాల్‌తో వీపు మధ్యభాగంలోని కండరాలకు వ్యాయామం లభిస్తుంది.
 
సింగిల్‌ ఆర్మ్‌ డంబెల్‌ రో
ఇది కూడా కండరాలకు మంచి వ్యాయామాన్నిస్తుంది. శరీరం సరైన పొజిషన్‌లో ఉండేలా చూసుకొని ఆరు లేదా ఎనిమిది రెప్స్‌ తీసుకొని డంబెల్స్‌తో ఎక్సర్‌సైజ్‌లు చేయాలి. బెంచీపైన పడుకొని చేస్తే బెటర్‌. బరువుల్ని ఛాతీవైపు తీసుకొస్తూ చేసే ఈ వ్యాయామం వల్ల వెన్నెముక భాగంలోని కండరాలు బలంగా తయారవుతాయి.